‘బిచ్చగాడు’ హీరోకి భలే గిరాకీ !
Published on Nov 8, 2016 9:50 am IST

VIJAY-ANTONY
డబ్బింగ్ చిత్రం ‘బిచ్చగాడు’ సృష్టించిన ప్రభంజనం అంటా ఇంతా కాదు. కేవలం రూ.50 లక్షలకు కొన్న ఈ చిత్రం సుమారు రూ. 20 కోట్ల వరకూ వసూళ్లు సాదినుంచి ఈ సంవత్సరం ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ విజయంతో విజయ్ ఆంటోనీ పట్ల ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడింది. ఆయన సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కూడా తయారయ్యారు.ఇక విజయ్ ఆంటోనీ కూడా ‘బిచ్చగాడు’ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తరువాతి సినిమా ‘సైతాన్’ను తెలుగులో ‘భేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఇకపోతే బిచ్చగాడు కలెక్షన్లతో భేతాళుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహించని స్థాయిలో భారీగా జరిగింది. ఈ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ హక్కులు రూ. 3 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే యూనిట్ కూడా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆడియోని ఘనంగా నిర్వహించింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై సినిమాకి మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చారు. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా.. ఈసారి విజయ్ ఆంటోనీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

 
Like us on Facebook