అవార్డుపై సంతోషాన్ని వ్యక్తం చేసిన త్రివిక్రమ్!

15th, November 2017 - 09:20:05 AM

ప్రస్తుత తెలుగు సినిమా దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డి ప్రత్యేక శైలి. ఒక వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోను ఆయనకు అభిమానులున్నారు. మాటలతో నవ్వించడమేగాక ఏడిపించడం కూడా తెలిసిన ఈ మాటల మాంత్రికుడికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో బి.ఎన్. రెడ్డి స్టేట్ అవార్డ్ దక్కింది.

తన అభిమానం దర్శకుడి పేరు మీదున్న అవార్డు తనకు రావడంతో త్రివిక్రమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారట. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ 25వ చిత్ర షూటింగ్ కోసం యూరప్ వెళ్లారు. త్వరలోనే పూర్తికానున్న ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. పవన్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ మూడవ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.