డిజిటల్ ప్రీమియర్ గా తుగ్లక్ దర్బార్…నేటి నుండి..!

Published on Sep 10, 2021 7:00 pm IST


విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఢిల్లీ ప్రసాద్ దీన దయాల్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం తుగ్లక్ దర్బార్. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం అయింది. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశి ఖన్నా, పార్తిబన్, మంజిమ మోహన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సన్ టీవీ లో నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా లో ఈరోజు రాత్రి 12 గంటల నుండి ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :