టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న సూపర్ స్టార్ “వెట్టైయాన్”

టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న సూపర్ స్టార్ “వెట్టైయాన్”

Published on Dec 22, 2023 9:18 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు ఆయన వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో టి.జే. జ్ఞానవేల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న వెట్టైయాన్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన శాటిలైట్ రైట్స్ పై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను తమిళం లో సన్ నెట్ వర్క్ సొంతం చేసుకోగా, తెలుగు లో ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ సొంతం చేసుకుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు