ఇద్దరు స్నేహితుల రెండు సినిమాలు ఒకేరోజు !
Published on Nov 4, 2017 5:02 pm IST

నారా రోహిత్ తక్కువ కాలంలో డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ హీరో నటుస్తోన్న సినిమా ‘బాలకృష్ణుడు’ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాతో పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్నా ఈ సినిమా లో రెజీనా హీరోయిన్. ఈ చిత్రాన్ని 24 న విడుదల చెయ్యబోతున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా మెంటల్ మదిలో ఈ సినిమాను నవంబర్ 24 న విడుదల చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. రాజ్ కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నిజ జీవితంలో మంచి మిత్రులు అయిన నారా రోహిత్ & శ్రీవిష్ణు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతుండడం విశేషం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook