ఐకాన్ స్టార్ పెర్ఫామెన్స్ కి మాత్రం యూనానిమస్ అప్లాజ్.!

Published on Dec 18, 2021 1:01 am IST

ఈ ఏడాది భారీ అంచనాలతో టాలీవుడ్ మరియు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకు వచ్చిన మరో సినిమా “పుష్ప”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది. మరి ఎన్నో అంచనాల నడుమ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఎప్పుడూ కూడా ఎవరి పాయింట్ ఒకేలా ఉండదు.

అది సినిమా వరకు వర్తిస్తుంది కానీ అల్లు అర్జున్ నటన విషయానికి వస్తే మాత్రం ఆడియెన్స్ అంతా కూడా ఒకటే యూనానిమస్ అప్లాజ్ ని ఇస్తున్నారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులని చేసేసింది. తన లుక్స్ కానీ సుకుమార్ డిజైన్ చేసిన పుష్ప రాజ్ పాత్రకి తగ్గట్టుగా బన్నీ తనని తాను మలచుకొని చూపించిన బాడీ లాంగ్వేజ్, మ్యానిరిజమ్స్ కానీ విమర్శకుల నుంచి ప్రశంసలు కురిపించేలా చేస్తుంది.

అసలు ఆ పుష్ప రాజ్ పాత్రలో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని రీతి పెర్ఫామెన్స్ తో ఇమిడిపోయేలా చెయ్యడంతో ఐకాన్ స్టార్ తన వంతు వరకు మాత్రం అనుకున్న దానికి మించే ఇచ్చి మెస్మరైజ్ చేసాడని చెప్పాలి. సినిమా ఫలితం అనేది మున్ముందు డిసైడ్ అవుతుంది కానీ ఐకాన్ స్టార్ మాత్రం సుకుమార్ చెప్పినట్టుగా ఈ సినిమాతోనే ఎందుకు ఐకాన్ స్టార్ గా మారుతాడు అనేదానికి మాత్రం ఈ సినిమాతోనే సమాధానం ఇచ్చేసాడు.

సంబంధిత సమాచారం :