‘బాహుబలి’ పాట కోసం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్.

‘బాహుబలి’ పాట కోసం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్.

Published on Jul 18, 2014 12:22 PM IST

bahubali
దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రభాస్, తమన్నాలపై ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం రాజమౌళి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నారు.

సాధారణంగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం రోప్స్, ట్రస్ ఉపయోగిస్తారు. రాజమౌళి వీటిని పాట చిత్రీకరణ కోసం వాడుతున్నారు. సినిమాలో పాట చాలా స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. ఆ పాటలో అంత స్పెషల్ ఏంటి..? రాజమౌళి రోప్స్, ట్రస్ ఎందుకు ఉపయోగిస్తున్నారో..? తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయండి అని బాహుబలి ట్విట్టర్ పేజిలో పోస్ట్ చేసి సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు. ‘షూటింగ్ సాంగ్ విత్ ప్రభాస్ & తమన్నా. లవ్ ద కాన్సెప్ట్, సింప్లీ అమైజింగ్’ అంటూ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ పేస్ బుక్ పేజిలో పోస్ట్ చేశారు. ఈ పాటకు శంకర్ మాస్టర్ నృత్యరీతులు(కోరియోగ్రఫీ) సమకూరుస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు