అన్ స్టాపబుల్: పుష్ప టీమ్ తో బాలయ్య సందడి… తగ్గేదేలే అంటూ తన స్టైల్ లో!

Published on Dec 25, 2021 3:02 am IST

ఆహా వీడియో ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు దగ్గరైన నందమూరి బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే, ఇప్పుడు సరికొత్త టీమ్ తో సందడి చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ కార్యక్రమం లో కి పుష్ప టీమ్ అడుగు పెట్టడం జరిగింది. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మీక మందన్న, దర్శకుడు సుకుమార్ ఈ కార్యక్రమం కి రావడం జరిగింది. అయితే ఈ షో లో నందమూరి బాలకృష్ణ తనదైన శైలి లో వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది.

పుష్ప చిత్రం లోని తగ్గేదేలే డైలాగ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ డైలాగ్ ను నందమూరి బాలకృష్ణ తనదైన శైలి లో తొడ కుడుతూ చెప్పడం అందరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలో ఆహా వీడియో లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ను ఆహా వీడియో విడుదల చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :