ఆడియో వేడుకకు సిద్దమవుతున్న ‘హలో’ ?
Published on Dec 4, 2017 5:09 pm IST

అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ‘హలో’ డిసెంబర్ 22న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతోంది టీమ్. ఇకపోతే ఈ చిత్ర ఆడియో వేడుకను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఈ నెల 10వ తేదీన వైజాగ్లో ఈ వేడుకను నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడం, నాగార్జున దగ్గరుండి అన్ని జాగర్తలు తీసుకుని సినిమాని నిర్మిస్తుంటడంతో సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు అభిమానులు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో కల్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

 
Like us on Facebook