ఇంకొంత ఆలస్యంగా ముంబై చేరుకోనున్న శ్రీదేవి పార్థివదేహం !
Published on Feb 26, 2018 11:51 am IST


ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ లోని హోటల్ గదిలో గుండెపోటుతో మరణించిన నటి శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరుకోవడం ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే దుబాయ్ చట్టాల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అక్కడి వైద్యులు ఖచ్చితమైన ల్యాబ్ రిపోర్ట్స్ ఇవ్వడంలో జాప్యం జరిగినందు వలన ఈ ఆలస్యమని తెలుస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అందిన వెంటనే భౌతిక కాయాన్ని అనిల్ అంబానీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నానికల్లా ఇండియా తీసుకురానున్నారు.

పార్థివ దేహాన్ని ముంబై చేరుకున్న వెంటనే అభిమానుల సందర్శనార్థం మెహబూబ్ స్టూడియోలో ఉంచి అనంతరం జుహులోని శాంటాక్రజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు శ్రీదేవి పార్థివ దేహాన్ని చూసేందుకు ఆమె ఇంటి వద్దకు చేరుకోగా అన్ని పరిశ్రమల నుండి ప్రముఖులు శ్రీదేవికి నివాళులర్పించేందుకు ఒక్కొకరిగా ముంబై చేరుకుంటున్నారు.

 
Like us on Facebook