అడివి శేష్ “హిట్ 2” నుండి ఉరికే ఉరికే సాంగ్ రిలీజ్!

అడివి శేష్ “హిట్ 2” నుండి ఉరికే ఉరికే సాంగ్ రిలీజ్!

Published on Nov 10, 2022 3:00 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 2 యొక్క ప్రమోషన్‌లు ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఉరికే ఉరికే పేరుతో రొమాంటిక్ సాంగ్ ను నేడు విడుదల చేశారు. ఈ వీడియో విజువల్స్‌తో పాటు అందంగా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట చాలా బాగుంది. శేష్ మరియు మీనాక్షి మధ్య కెమిస్ట్రీ అదిరింది. సాంగ్ బీట్ ఆకట్టుకుంటుంది.

పాట చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఎం.ఎం. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతం అందించారు. నటుడు నాని నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. హిట్ 2 కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు