వరుడు కావలెను నుంచి రేపు “వడ్డానం” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..!

Published on Oct 26, 2021 9:47 pm IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 29న రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ‘వడ్డానం’ ఫుల్ వీడియో సాంగ్ రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ కాబోతుంది. కాగా పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More