“వలిమై” థలా ఫ్యాన్స్ తో పాటు వారికి బాగా నచ్చుతుందట

Published on Oct 14, 2021 10:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా “వలిమై” కోసం అంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రంని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపనున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ ఎప్పుడికప్పుడు ఏదొక అప్డేట్ ఈ మధ్య కాలంలో ఇస్తూనే ఉన్నారు. మరి ఈ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ లేటెస్ట్ గా చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది వరకే ఈ సినిమా ఆల్రెడీ ఒక భారీ యాక్షన్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అందరికీ అర్ధం అయ్యింది. మరి రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అజిత్ అభిమానులకు ఈ సినిమా డెఫినెట్ గా మంచి ట్రీట్ ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుంది అని వినోత్ చెబుతున్నాడు. అయితే ఈ సినిమాలో అద్భుతమైన మదర్ సెంటిమెంట్ ఇంకా ఒక సాంగ్ కూడా ఉందని ముందే తెలిపారు. మరి బహుశా ఇవే ఈ సినిమా ని ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా చేస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :