నిన్న సూపర్ స్ట్రాంగ్ గా “వకీల్ సాబ్”.!

Published on Apr 14, 2021 10:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అనన్య నాగళ్ళ సహా అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. మరి పవన్ కం బ్యాక్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

అలాగే మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా సినిమా హిట్ ప్రభావానికి ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చడంతో నిన్న పండుగ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఖాళీ లేకుండా పోయింది. దీనితో ఖచ్చితంగా వకీల్ సాబ్ భారీ ఫిగర్ ను మళ్ళీ డే 2 స్థాయిలో కానీ 3 స్థాయిలో కానీ కొల్లగొడుతుంది అని అంతా ఆశిస్తున్నారు.

మరి అలాగే దగ్గరలో మళ్ళీ సినిమాలు లేకపోవడంతో వకీల్ సాబ్ వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా నిలబడడం ఖాయం అని తెలుస్తుంది. ఇలా మొత్తానికి మాత్రం పవన్ కం బ్యాక్ అడ్డంకుల్ని అధిగమించి కూడా అదరగొడుతుంది అని చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కించగా థమన్ సంగీతం ఇచ్చాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :