సంక్రాంతి బరిలో వలిమై…ప్రమోషన్స్ షురూ..!

Published on Jan 4, 2022 2:30 pm IST


అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినొత్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం ను బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి మరియు జీ స్టూడియోస్ పతాకంపై బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం. ఈ చిత్రం లో హుమ ఖురేషీ, కార్తికేయ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ను ఈ నెల జనవరి 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తెలుగు, తమిళ భాషలతో పాటుగా హిందీ లు కూడా విడుదల చేస్తుండటం విశేషం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. సంక్రాంతి బరిలో ఆర్ ఆర్ ఆర్ మూవీ తప్పుకోవడం తో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :