లేటెస్ట్ : విజయ్ ‘వారసుడు’ రిలీజ్ పై మేకర్స్ సాలిడ్ అప్ డేట్

Published on Sep 25, 2022 3:11 am IST


ఇలయతలపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ బైలింగువల్ మూవీ వారసుడు. తమిళ్ ఈ మూవీ వరిసు గా తెరకెక్కుతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న వారసుడు మూవీకి సంబంధించి కేవలం రెండు సాంగ్స్, అలానే రెండు యాక్షన్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని రేపటి నుండి జరుగనున్న లాస్ట్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం అంటూ నిర్మాతలు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు.

అలానే మూవీని పక్కాగా 2023 పొంగల్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా వారు తమ పోస్ట్ లో తెలిపారు. పవర్ఫుల్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ పళని ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ, సంగీత క్రిష్, కుష్బూ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :