దేవాలయంలో పూజలు చేస్తున్న వీర రాఘవ !

Published on Aug 4, 2018 9:44 am IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ఓ దేవాలయం లో ఎన్టీఆర్ ఫై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ పాటల చిత్రీకరణ కోసం సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లనుంది. దాంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

ఈసినిమాలో ప్రముఖ హాస్య నటుడు, హీరో సునీల్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన పాత్రకు సంభందించిన సన్నివేశాలను తెరకెకెక్కించారు. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తుండగా రావు రమేష్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను ఆగష్టు 15 న విడుదలచేయనున్నారని సమాచారం.

తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More