50 రోజుల “వీరసింహా రెడ్డి”..డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్.!

Published on Mar 2, 2023 6:59 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా హనీ రోజ్ మరియు శృతి హాసన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం “వీరసింహా రెడ్డి”. బాలయ్య నుంచి అఖండ లాంటి మాసివ్ హిట్ తర్వాత ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా మాస్ అండ్ నందమూరి అభిమాన జనంకి ఈ చిత్రం మంచి ట్రీట్ ఇచ్చింది. అయితే ఈ సీనేంక్ ఈరోజు తో 50 రోజుల సక్సెస్ ఫుల్ రన్ ని థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది.

దీనితో దర్శకుడు ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని పెట్టి తన అనుభవం ని వ్యక్త పరిచారు. “ఒక మర్చిపోలేని అనుభూతి లెక్కలేనన్ని జ్ఞాపకాలను మీరు అందించారు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారితో ఒకవీర మాస్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం అనేది నాకు ఒక కల లాంటిది” అని బాలయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ తన ఉత్సుకత ను గోపి వ్యక్తం చేశారు. దీనితో బాలయ్య కి ఈ రేంజ్ హిట్ ఇచ్చిన గోపిచంద్ కి మరోసారి నందమూరి అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

సంబంధిత సమాచారం :