లేటెస్ట్ :” వీర సింహారెడ్డి” పూర్తి..మరిన్ని డీటెయిల్స్ ఇవే.!

లేటెస్ట్ :” వీర సింహారెడ్డి” పూర్తి..మరిన్ని డీటెయిల్స్ ఇవే.!

Published on Dec 7, 2022 3:29 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే బాలయ్య అఖండ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే స్టార్ట్ అయ్యిపోయి శరవేగంగా షూట్ స్టార్ట్ చేసేసుకుంది.

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే జెట్ స్పీడ్ లో సినిమా షూటింగ్ ని ప్లానింగ్ ప్రకారం చేయగా ఇప్పుడు అయితే సినిమా టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా లేటెస్ట్ అప్డేట్ తెలిసింది. అలాగే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు అయితే ఒక్క సాంగ్ మాత్రం కంప్లీట్ కావాల్సి ఉండగా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈ సినిమా నుంచి శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయట.

మరి మొత్తానికి అయితే వీరసింహా రెడ్డి షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి జాతరకు రెడీ అవుతున్నాడని చెప్పాలి. అలాగే ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు