వెంకటేష్ ఖాళీ సమయాల్లో అక్కడికి వెళతారట
Published on Nov 18, 2017 11:01 am IST

టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే హీరోల్లో వెంకటేష్ ఒకరు. కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తెరపై వివిధ రకాల గెటప్స్ తో కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన ఎవరు ఊహించని విధమైన దారిలో నడుస్తుంటారు. ఎక్కువగా వెంకటేష్ ఆత్యాద్మికత గురించి ఆలోచిస్తుంటారు.

అయితే ఇటివల వెంకటేష్ ఆత్యాద్మిక గురువు రమణ మహర్షిని కలిశారట. ఖాళీ సమయాలలో ఎక్కువగా అయనను కలుస్తానని చెప్పారు. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. తేజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రం షూటింగ్ వెంకటేష్ పుట్టిన రోజు సందర్బంగా ఈ నెల 13న స్టార్ట్ కానుంది. అంతే కాకుండా మరికొన్ని కథలను కూడా వెంకీ ఒకే చేసినట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook