ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయిన వెంకటేష్ మూవీ

Published on Dec 7, 2022 1:03 am IST


టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఓరి దేవుడా మూవీలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కిసి కి భాయ్ కిసి కి జాన్ అనే మూవీలో ఆయన నటిస్తున్నారు.

అయితే విషయం ఏమిటంటే, వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మూవీ నారప్ప. గత ఏడాది జులై లో ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ అందుకుంది. కాగా రాబోయే డిసెంబర్ 13న వెంకటేష్ బర్త్ డే సందర్భంగా నారప్ప మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ధనుష్ హీరోగా రూపొందిన అసురన్ కి రీమేక్ గా నారప్ప తెరకెక్కిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :