రైస్ మిల్ ఓనర్ గా వెంకీ ?

Published on Feb 17, 2019 3:08 pm IST


ఇటీవల ‘ఎఫ్2’ తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా మరో మల్టీ స్టారర్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. ‘ జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న ‘వెంకీమామ’ చిత్రంలో వెంకీ , యువ సామ్రాట్ నాగ చైతన్య తో కలిసి నటించనున్నాడు. నిజ జీవితంలో మామ – అలుళ్లు అయినా వీరిద్దరూ ఈ సినిమాలో కూడా అలాగే కనిపించనున్నారు.

ఇక ఈ చిత్రంలో వెంకీ రైస్ మిల్ ఓనర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుండగా చైతూ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. వచ్చే వారంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :