‘భీష్మ’ ఫై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు !

Published on Dec 23, 2018 6:15 pm IST

మొదటి సినిమా ‘ఛలో’ తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమాను యంగ్ హీరో నితీన్ తో చేయనున్నాడని తెలిసిందే. అయితే డిసెంబర్ నెలలోనే స్టార్ట్ కావల్సిన ఈచిత్రం వాయిదాపడింది. తాజాగా ఈ చిత్రం ఫై వెంకీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజి లో ఉందని అలాగే నితిన్ షోల్డర్ ఇంజురీ నుండి కోలుకుని ఈసినిమా కోసం కొత్త లుక్ లోకి రావడానికి కష్టపడుతున్నాడని త్వరలోనే ఈ చిత్రం స్టార్ట్ కానుందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

కమర్షియల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైనెర్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మించనున్నది. ఇక ఇటీవలవరుస పరాజయాలతో కొనసాగుతున్న నితిన్ ఈ చిత్రం తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని పట్టుదలగా వున్నాడు.

సంబంధిత సమాచారం :