మలయాళ సినిమాను రీమేక్ చేయనున్న వెంకటేష్ ?
Published on Mar 11, 2018 12:28 pm IST

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘ఆట నాదే వేట నాదే’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో వెంకీ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుండగా నారా రోహిత్ ఒక కీలక పాత్ర చేయనున్నారు. ఫిలిం నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు వెంకీ మలయాళ హిట్ సినిమా ‘ది గ్రేట్ ఫాదర్’ ను తెలుగులోకి రీంకే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకీ ఇటీవలే ఈ చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారని, అందుకే రీంకే చేయాలనుకుంటున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఈమేరకు నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది. హనీఫ్ అదేని దర్శకత్వంలో మమ్ముటి నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ యొక్క తమిళ రీమేక్లో విక్రమ్ నటించనున్నాని కూడ తెలుస్తోంది.

 
Like us on Facebook