సూర్యకి అండగా సిద్ధార్థ్, అసురణ్ దర్శకుడు.!

Published on Nov 17, 2021 9:00 am IST


కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “జై భీమ్” మళ్ళీ ఓవరాల్ ఓటిటి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. భారీ రేటింగ్స్ తో మాత్రమే కాకుండా భారీ వ్యూవర్ షిప్స్ తో ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా దర్శకుడు టీ జె జ్ఞ్యానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే తమిళ్ మరియు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది అనే లోపే కొన్ని ఊహించని చిక్కులు సూర్యకి మరియు చిత్ర యూనిట్ కి ఎదురయ్యాయి. కులం పరంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు పరంగా సూర్యకి బెదిరింపులు, నోటీసులు వెళ్లాయి. అయితే తమిళ్ హీరోలకి ఇవి కొత్త కాదు కానీ అదే సమయంలో వారికి అండగా మొత్తం ఇండస్ట్రీ కూడా ఏకమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అలాగే ఇప్పుడు సూర్య కి తోడుగా ఈ సినిమా చూసిన తర్వాత హీరో సిద్ధార్థ్ మరియు “అసురణ్” దర్శకుడు వెట్రిమారన్ లు తమ సపోర్ట్ ని బాహాటంగా తెలియజేసారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకి తాము కూడా అండగా ఉన్నామని ఇలాంటి సినిమా ఇచ్చినందుకు దర్శకుడికి సూర్య కి ధన్యవాదాలు కూడా తెలియజేసారు.

సంబంధిత సమాచారం :