విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు – 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 27, 2023 11:14 pm IST


విజయ్ ఆంటోనీ హీరోగా శశి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు మూవీ 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ భారీ విజయంతో నటుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని ఆ తరువాత మరిన్ని మంచి సినిమాల ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. ఇక ప్రస్తుతం బిచ్చగాడు కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ బిచ్చగాడు 2. విజయ్ ఆంటోని నటిస్తూ సంగీతం అందిస్తుండడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించిన ఈమూవీని ఫాతిమా విజయ్ ఆంటోనీ గ్రాండ్ గా నిర్మించారు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ స్నీక్ పీక్ ట్రైలర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. అయితే విషయం ఏమిటంటే బిచ్చగాడు 2 మూవీని సమీర్ కానుకగా ఏప్రిల్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. హరీష్ పెరాడి కీలక రోల్ పోషించిన ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించారు.

సంబంధిత సమాచారం :