‘మహానటి’లో ముఖ్య పాత్ర పోషించనున్న విజయ్ దేవరకొండ !
Published on Nov 7, 2017 3:03 pm IST

భారతీయులు గర్వంచదగ్గ నటీమణుల్లో సావిత్రి కూడా ఒకరు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బయోపిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సావిత్రి జీవితంలో కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా తీస్తున్నాడు. చాలా మంది నటులు, దర్శకులు ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా మరో హీరో ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి విజయం అందుకున్న హీరో విజయ్ దేవరకొండ అక్కినేని నాగేశ్వర రావ్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ షూటింగ్ లో విజయ్ పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మహానటిగా పేరుపొంది, వ్యక్తిగత, సినీ జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలను చూసిన సావిత్రి పై రూపొందుతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి దీనిపై ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

 
Like us on Facebook