సై రా లో విజయ్ సేతుపతి పాత్ర ఇదేనా ?

ఖైది నెంబర్ 150 తరువాత చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటివల ప్రారంభం అయ్యింది, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అనువాదం కానుంది. ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులు ఈ సినిమాలో నటించబోతున్నారు.

తాజా సమాచారం మేరకు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒబయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఒబయ్య కుడి భుజం వంటివాడు. అంటే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు నమ్మకంగా ఉండే పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యంలా ఉండబోతుంది.