మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కు సైన్ చేసిన విజయ్ దేవరకొండ !

19th, October 2017 - 04:30:09 PM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకులకు, నిర్మాతలకు హాట్ ఫెవరెట్ గా మారిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ముఖ్యంగా కొత్త దర్శకులు ఆయన కోసమే కథల్ని తయారుచేసుకుంటున్నారు. విజయ్ కూడా భిన్నమైన, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమాల్నే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం భారీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్-2, యువీ క్రియేషన్స్ తో రెండు సినిమాల్ని చేస్తున్న విజయ్ మరొక రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కూడా సైన్ చేశారు.

ఆ చిత్రమే ‘ఏ మంత్రం వేసావే’. దీపావళి సందర్బంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు శ్రీధర్ మర్రి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శివాని హీరోయిన్ గా నటిస్తోంది. గోలీసోడా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం కూడా బలమైన భావోద్వేగాలు కలిగిన ప్రేమ కథగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం యొక్క షూటింగ్, ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.