విజయ్ ‘సర్కార్ ‘ మూవీ అప్ డేట్స్ !

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్రం ‘సర్కార్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ , ఫస్ట్ లుక్ అభిమానులను అక్కట్టుకోగా ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో విజయ్ పాత్ర ప్రముఖ కంపెనీ ‘గూగుల్’ ప్రస్తుత సిఈఓ’సుందర్ పిచాయ్’ ను పోలి ఉంటుందట. అలాగే ఆయన యు ఎస్ లో విలాసవంతమైన జీవితం గడిపి తమిళనాడు కు వచ్చి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారట.

మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి క్లైమాక్స్ హైలైట్ అవ్వనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈచిత్రం భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.