సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “విక్రమ్”..!

Published on Oct 3, 2021 12:56 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గిరీష్ గంగాధరన్ విక్రమ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :