“విక్రాంత్ రోణ” ఫస్ట్ గ్లింప్స్ దుమ్ము లేపేశాడుగా!

Published on Sep 2, 2021 6:28 pm IST

సుదీప్ కిచ్చా హీరోగా అనూప్ భండారి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రాంత్ రొణ. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా ఐదు బాషల్లో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయింది. సుదీప్ కిచ్ఛా పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ గ్లింప్స్ సూపర్ గా ఉంది.

డెడ్ మాన్ ఆంతెం గా విడుదల అయిన ఈ గ్లింప్స్ లో సుదీప్ మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తున్నారు. పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. డైలాగ్స్ తో నుండి ఉన్న ఈ గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది అని చెప్పాలి. ఈ చిత్రం లో నిరూప్ భండారి, నీత అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బీ. అజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :