మూవీ పై మరింత అంచనాలు పెంచిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ ట్రైలర్

Published on Feb 17, 2023 6:47 pm IST

కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ హీరో హీరోయిన్స్ గా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా వినరోభాగ్యము విష్ణుకథ. తిరుమల తిరుపతి నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా కొద్దిసేపటి క్రితం విడుదలైన రిలీజ్ ట్రైలర్ వాటిని మరింతగా పెంచేసింది అనే చెప్పాలి.

ముఖ్యంగా రిలీజ్ ట్రైలర్ లో యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఆకట్టుకునే ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ వంటివి ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటి మరింతగా పెంచాయి అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వినరోభాగ్యము విష్ణు కథ మూవీ రేపు ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది. కాగా నేడు మరికొద్దిసేపటిలో ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :