వినాయక్ ఎదురు చూడక తప్పదా ?
Published on Jun 24, 2018 8:58 am IST

దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలయ్యతో తమ చిత్రాన్ని మొదలుపెట్టాలని వినాయక్, సి కళ్యాణ్ భావించారు. కానీ ఇంతవరకు కథ సెట్ అవ్వకపోవడంతో పరిస్థితులు మారేలా కనిపిస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన తర్వాతి చిత్రం ఉంటుందని ‘ఇండో అమెరికన్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్’లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ మాటల మధ్యలో చెప్పారు. బోయపాటి కూడా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా తరువాత బాలయ్యబాబుతోనే తన సినిమా ఉంటుందని గతంలోనే చెప్పారు. మరి వినాయక్ చిత్రం ఎప్పుడు ? బోయపాటి, బాలయ్య కాంబో’లో వచ్చే చిత్రం పూర్తి అయ్యేదాకా వినాయక్ ఎదురుచూడక తప్పదా ?

గత కొంతకాలంగా వినాయక్ కి ‘ఖైదీ 150’ తప్ప సరైన హిట్ లేదు. సాయిధరమ్ తేజ్ తో తీసిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం భారీ పరాజయం పాలవ్వడంతో స్టార్ హీరోలు ఎవ్వరు వివి వినాయక్ కు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క బాలయ్య తప్ప వినాయక్ ని పిలిచి మరి సినిమా చేద్దామంటున్న స్టార్ హీరో లేడని సమాచారం. దాంతో వినాయక్ బాలయ్య కోసం ఎదురు చూడక తప్పేలా లేదు. పైగా ఇప్పటివరకీ కథ కూడా ఫైనల్ కాలేదు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook