కొత్త సినిమాను ప్రారంబించనున్న వినాయక్ !


‘ఖైదీ నెం 150’ చిత్రంతో మరోసారి టాప్ దర్శకుల జాబితాలో చేరిన వి.వి. వినాయక్ కొంత గ్యాప్ తర్వాత కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. అది కూడా మెగాహీరో సాయి ధరమ్ తేజ్ తో. అంత భారీ విజయం తర్వాత వినాయక్ ఏ హీరోతో సినిమా చేస్తాడో చూడాలని ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన తేజ్ ను చూజ్ చేసుకోవడం ఒకింత విశేషంగానే కనిపిస్తోంది.

ఇప్పటికే ‘తిక్క, విన్నర్’ రీసెంట్ గా ‘నక్షత్రం’ వంటి సినిమాలు పరాజయం పొంది అత్యవసర హిట్ కోసం ఎదురుచూస్తున్న ధరమ్ తేజ్ కు వినాయక్ చిత్రం కలిసొస్తుందని, మాస్ హీరోగా ఇంకాస్త నిలదొక్కుకునేందుకు సహకరిస్తుందని అనుకోవచ్చు. ఈ చిత్రాన్ని రేపు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే మీద వర్క్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.