వైరల్ : ఒక ఊరు అంతా కలిసి “అఖండ” చూసిన వేళ.!

Published on Jan 25, 2022 7:04 am IST


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం “అఖండ”. వీరి కాంబోలో వచ్చిన మొదటి రెండు సినిమాలు కంటే ఎక్కువ స్థాయిలో ఈ సినిమా విజయం కోసం అంతా మాట్లాడుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అందుకున్న విజయంతో పాటే మళ్లీ ఎన్నో మరచి పోయిన పాత రోజులని గుర్తు చేసింది.

ఇక ఇదిలా ఉండగా అఖండ ఖాతాలో ఇంకో ఇంటరెస్టింగ్ ఫీట్ వచ్సి పడింది. ఈ సినిమాని ఏకంగా ఒక ఊరు ఊరంతా కలసి తెరపై వేసుకొని చూడడం వైరల్ గా మారింది. మరి ఈ అద్భుతమైన సంఘటన కాస్తా గుంటూరు జిల్లాలో జరిగినట్టు తెలుస్తోంది. దీనితో ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే మిర్యాల రవీంద్ర రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :