వైరల్ : ఒకే ఫ్రేమ్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ కమల్ మరియు రజినీకాంత్ లు.!

Published on May 29, 2022 3:00 pm IST


కోలీవుడ్ కి చెందిన బిగ్ స్టార్స్ లో మన ఇండియన్ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడో మంచి క్రేజ్ తెచ్చిన స్టార్ హీరోలలో లెజెండరీ హీరోలు సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ లు ప్రథములు. అయితే ఇప్పటికీ కూడా వీరి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అదిరే లెవెల్లో పెర్ఫామ్ చేస్తుంటాయి. అయితే మరి ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? రీసెంట్ టైమ్స్ లో అయితే వీరి కలయిక తక్కువేగానే కనిపించింది.

కానీ లేటెస్ట్ గా కమల్ తన భారీ సినిమా “విక్రమ్” ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న క్రమంలో తాను అలాగే తన దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ లు కలవడం విశేషంగా మారింది. అయితే ఈ సందర్భంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో ఫోటో దిగగా ఇప్పుడు అది ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దీనితో ఈ సాలీడ్ ఫ్రేమ్ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కమల్ నటించిన ఈ సినిమాలో సూర్య, విజయ్ సేతుపతి అలాగే ఫహాద్ ఫాజిల్ లు నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ జూన్ 3న భారీ స్థాయిలో రిలీజ్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం :