ఫహద్ ఫాజిల్ హీరోగా, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌కు స్టా్ర్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కూడా గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన తమ్ముడు కార్తికేయ నిర్మాతగా మారుతూ చేస్తున్న ఈ ప్రయత్నం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఇండియన్ సినిమాలోనే అత్యుత్తమ నటుల్లో ఒకరైన ఫహద్ ఫాజిల్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించడం విశేషమని, ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఎన్టీఆర్ కొనియాడాడు.
ఇదే వేదికపై ఎన్టీఆర్ తనను దశాబ్దాలుగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న అభిమానుల ప్రేమే తన అసలైన బలం అని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు. రాజమౌళి కుటుంబంతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, చిత్ర దర్శకుడు శశాంక్ ఏలేటితో పాటు సంగీత దర్శకుడు కాలభైరవ, మొత్తం చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది కార్తికేయకు నిర్మాతగా గొప్ప విజయాన్ని అందించాలని తారక్ కోరాడు.


