ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయాలని ఉందన్న విశ్వక్ సేన్!

Published on Mar 21, 2023 9:30 pm IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ధమ్కీ. ఈ చిత్రం లో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చ్ 22 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మేరకు ప్రమోషన్స్ లో భాగం గా హీరో, దర్శకుడు విశ్వక్ సేన్, ఆస్క్ విశ్వక్సేన్ అంటూ నెటిజన్స్ తో చర్చ కి దిగారు. ఈ మేరకు ఒక నెటిజన్ ఏ హీరోను డైరెక్ట్ చేయాలని ఉంది అని అడగగా, నా మాస్ అమ్మ మొగుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చి, చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలిపారు.

సంబంధిత సమాచారం :