ఓటిటి : తెలుగులో “ఓపెన్ హైమర్” చూడాలనుకుంటున్నారా? ఎందులో అంటే

ఓటిటి : తెలుగులో “ఓపెన్ హైమర్” చూడాలనుకుంటున్నారా? ఎందులో అంటే

Published on Mar 23, 2024 3:22 PM IST


రీసెంట్ గా ఆస్కార్ (Oscars 2024) సెన్సేషన్ చిత్రం “ఓపెన్ హైమర్” (Oppenheimer) కోసం అందరికీ తెలిసిందే. కిలియన్ మర్ఫీ (Cillian Murphy) ప్రధాన పాత్రలో హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకుని కూడా అదరగొట్టింది. మరి అకాడమీలో కూడా ఏకంగా 6 అవార్డ్స్ ని అందుకొని చిత్ర యూనిట్ కి గర్వ కారణంగా నిలిచింది.

ఇక ఈ చిత్రం జస్ట్ కొన్ని రోజులు కితమే ఇండియాలో ఓటిటి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇంగ్లీష్ సహా హిందీ భాషల్లో ఈ చిత్రం మొదట అందుబాటులోకి వచ్చింది. అయితే నోలన్ బ్రాండ్ కి ఉన్న పేరుతో తెలుగులో కూడా ఈ సినిమా కోసం ఎదురు చూసినవారు లేకపోలేరు. మరి వారికి ఇతర ప్రాంతీయ వెర్షన్ కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది.

ఈ చిత్రం ఇప్పుడు తెలుగు సహా దాదాపు ఇండియాలో ప్రముఖ భాషలు అన్నిటిలో కూడా పాన్ ఇండియా ఓటిటి రిలీజ్ కి ఈ చిత్రం వచ్చేసింది. అదే జియో సినిమాలో ఈ చిత్రం ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి తెలుగులో ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు అయితే ఈ సినిమాని జియో సబ్ స్క్రిప్షన్ ఉంటే వీక్షించవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు