రెట్లు పెరగనున్న సినిమా టికెట్స్! జిఎస్టీ ఎఫెక్ట్!

రెట్లు పెరగనున్న సినిమా టికెట్స్! జిఎస్టీ ఎఫెక్ట్!

Published on Jun 27, 2017 4:57 PM IST


ప్రస్తుతం దేశం వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జిఎస్టీతో ఒక్కసారిగా చాలా మార్పులు వచ్చాయి. ఇవి ముఖ్యంగా సినిమా ప్రేక్షకుల మీద భారం పడుతున్నాయి. జిఎస్టీ పన్ను చెల్లింపులో భాగంగా మొదటిగా సినిమా టికెట్స్ మీద ఆ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సినిమా టికెట్స్ రేట్స్ ఒక్కసారిగా పెరగనున్నాయి. దియేటర్ రేంజ్ బట్టి పన్ను భారం టికెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో ఒకలా, అలాగా మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాలు, పంచాయితీలు బట్టి పన్ను భారం టికెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. మామూలు సాధారణ టికెట్స్ మీద 4 నుంచి 6 రూపాయిలు అదనంగా ఉంటె. మల్టీప్లెక్స్ లో మాత్రం 50 రూపాయిల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని వలన సామాన్య, మధ్యతరగతి సినిమా ప్రేక్షకులకి ఈ పన్ను భారం కాస్తా భారం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు