బన్నీకి మళ్ళీ గ్యాప్ వచ్చేలా ఉందిగా..!

Published on Mar 26, 2020 9:03 am IST

దేశంలో కరోనా బారినపడ్డ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 500 దాటిపోయాయి. కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోవడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోగా సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు కొత్త చిత్రాల విడుదల, షూటింగ్స్ షురూ చేసే అవకాశం లేదు.

టాలీవుడ్ లో అనేక భారీ మరియు చిన్న చిత్రాల షూటింగ్ బ్రేక్ పడింది. సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో ఓ మాస్ అండ్ యాక్షన్ ఎంటెర్టైనర్ తెరకెక్కుతుండగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి కావడంతో అక్కడ షూటింగ్ చేసే ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితి నెలకొని షూటింగ్ మొదలుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో బన్నీ-సుకుమార్ ల మూవీ 2020లో రావడం కష్టమే అంటున్నారు. బన్నీకి మళ్ళీ గ్యాప్ రావడం ఖాయం అని కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More