బుల్లితెర పై మళ్ళీ “ఇంద్ర” సత్తా చాటేనా?

బుల్లితెర పై మళ్ళీ “ఇంద్ర” సత్తా చాటేనా?

Published on Dec 21, 2023 10:16 AM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కీలక మైలు రాయి గా నిలిచిన మరొక బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర. ఈ చిత్రం చిరు కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి టెలివిజన్ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అయిపోయింది. జీ సినిమాలు ఛానెల్ లో ఈ సినిమా డిసెంబర్ 30 వ తేదీన సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఈ సినిమా మరోసారి ఆడియెన్స్ ను అలరిస్తుందా లేదా అనేది తెలియాలి.

సోనాలి బిండ్రే, ఆర్తి అగర్వాల్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి పరచూరీ బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించగా, బి. గోపాల్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు