కర్ణాటకలో కాలా రిలీజ్ అవుతుందా ?

Published on May 27, 2018 5:36 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా కాలా జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే . కాకపోతే ఈ సినిమా కర్ణాటకలో విడుదలవడం కష్టంగా మారింది. కాలా చిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదలచేయనివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
దీనికి కారణం ఇటీవల కావేరి జలాల వివాదం కారణంగా రజనీకాంత్ తమిళనాడుకు అనుకూలంగా మాట్లాడడమే కాకుండా నిరసన కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. స్వయంగా కన్నడిగుడైన రజినికాంత్ తమ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతేరేకంగా మాట్లాడడం కన్నడ సంఘాలకి నచ్చడం లేదు .

మామూలుగానే రజినీకాంత్ సినిమాలు కర్ణాటకలో కోట్లు కురిపిస్తూ ఉంటాయి . మరి ఈ చిత్రం ఒకేవేళ అక్కడ రిలీజ్ అవ్వకుంటే భారీ లాభాలను వదులుకోవాల్సి వస్తుంది .దీనిపై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి పైగా ఈ చిత్రాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మించాడు. మరి ఈ వివాదం నేపథ్యంలో ఈ సినిమా అక్కడ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :