మహేష్ సెంటిమెంట్ అఖిల్ కు కలిసొస్తుందా ?

Published on Jan 24, 2019 3:45 pm IST

‘బ్రహ్మోత్సవం , స్పైడర్’ చిత్రాలతో వరస డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ చిత్రం విజయం సాధించడంలో కథ , దర్శకుడి టేకింగ్ కీలక పాత్రను పోషించాయి. అయితే ఈచిత్రానికి కొన్ని సెంటిమెంట్లు కూడా వర్క్ అవుట్ ఆయ్యాయి. అందులో ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిదిగా రావడం ఒకటైయితే సినిమా విడుదలకు ముందు మహేష్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ కి పార్టీ ఇవ్వడం రెండవది.

ఇక ఇప్పుడు ఇవే సెంటిమెంట్లు యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన ‘మిస్టర్ మజ్ను’ కు కూడా రిపీట్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఈచిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ చీఫ్ గెస్ట్ గా రాగా అఖిల్ , చరణ్ , తారక్ లకు నైట్ పార్టీ ఇచ్చాడు. మరి ‘అఖిల్ , హలో’ చిత్రాలతో విజయాలు అందుకోలేకపోయిన అఖిల్ ఈ సెంటిమెంట్ల తో కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకుంటాడో లేదో తెలియాలంటే రేపటి వరుకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :

More