ఈ ఎఫెక్ట్ “RRR” మీద పడదు కదా..?

Published on Aug 13, 2020 10:29 pm IST


ఇప్పుడు మన దేశపు బాక్సాఫీస్ దగ్గర దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఏక కాలంలో అన్ని కీలక భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి ఇప్పుడు మరో షాక్ తగాలనుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పుడు బాలీవుడ్ సినీ వర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మ హత్య ఘటన అక్కడి చాలా మంది స్టార్ నటులు సహా నిర్మాతల సినిమాలకు ఎఫెక్ట్ ఇచ్చింది. అందుకు ఉదాహరణగా నిన్ననే విడుదల కాబడిన “సడక్ 2” ట్రైలర్ ను చెప్పొచ్చు. ఈ ట్రైలర్ మరియు సినిమాకు ఈ స్థాయి నెగిటివి రావడానికి కారణం మహేష్ భట్ మరియు ఆలియా భట్ లు అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే ఆలియా భట్ RRR లో కూడా ఉంది. అలా ఏమన్నా ఈ చిత్రానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత బాలీవుడ్ మార్కెట్ లో రాజమౌళి తన సినిమాలకు ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్నారు. మరి జక్కన్నఈ చిత్రానికి ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More