‘అంతరిక్షం’తో వరుణ్ హ్యాట్రిక్ కొడతాడా ?

Published on Dec 20, 2018 10:35 am IST

‘లోఫర్ , మిస్టర్’ పరాజయాల తరువాత ‘ఫిదా’ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు మెగా హీరో వరుణ్ తేజ్. గత ఏడాది లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని వరుణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం తరువాత ఈ ఏడాది ప్రారంభంలో కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘తొలిప్రేమ’ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చిన వరుణ్ కు ఈ చిత్రం కూడా మంచి విజయాన్నిఅందించింది. ఈ రెండు కూడా లవ్ స్టోరీ లే కావడం విశేషం.

ఇక ఇప్పుడు డిఫ్రెంట్ స్టోరీ తో వరుణ్ ‘అంతరిక్షం’ అనే చిత్రంలో నటించాడు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఇప్పుటికే ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇమేజ్ కోసం పరితపించకుండా వరుణ్ చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రం విజయం సాధించి ఆయనుకు హ్యాట్రిక్ ను అందిస్తుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :