‘వైఎస్సార్’ సినిమాలో విజయ్ దేవరకొండ ?

Published on Sep 15, 2018 11:55 am IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరోక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. వైఎస్. జగన్ పాత్రలో యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూసే హల్ చల్ చేస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గాని, విజయ్ మాత్రం జగన్ పాత్రలో కనిపిస్తే అతని కెరీర్ కు చాలా ప్లస్ కానుంది. ఇప్పటికే ‘గీత గోవిందం’ స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్న విజయ్, ఈ సినిమా నటిస్తే మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి విజయ్ ఈ సినిమాలో నటిస్తాడో లేడో చూడాలి. కాగా వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :