12 మిలియన్ తో సౌత్ ఇండియాలో ఏకైక హీరోగా మహేష్.!

Published on Dec 3, 2021 3:00 pm IST

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇదే క్రేజ్ సోషల్ మీడియాలో కూడా మహేష్ కి భారీ లెవెల్లోనే ఉంటుంది. మరి ఇపుడు సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా ఫ్యామిలీ మరో మైల్ స్టోన్ ని అందుకుంది. తన ట్విట్టర్ ఖాతా ఇప్పుడు 12 మిలియన్ ఫ్యామిలీగా మారింది.

అంటే ఒక్క ట్విట్టర్ నుంచే మహేష్ ని ఒక కోటి 12 లక్షల మంది ఫాలో అవుతున్నారన్నమాట. దీనితో 12 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన సౌత్ ఇండియన్ నటునిగా సూపర్ స్టార్ మహేష్ సాలిడ్ రికార్డ్ సెట్ చేసాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మహేష్ దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ చేస్తుండగా అది వచ్చే ఏడాది ఏప్రిల్ 1న రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం :