అతని బర్త్ డే..ఎన్టీఆర్ మూవీ ఇండియన్ వైడ్ ట్రెండింగ్.!

Published on Oct 16, 2021 4:03 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నటించిన తన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసి గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” లో బిజీగా ఉన్నాడు. అయితే తారక్ నెక్స్ట్ తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో భారీ పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఆల్రెడీ తన మేకోవర్ ని కూడా మార్చేశాడు.

కానీ ఈ సినిమా విషయంలో ఎప్పుడు నుంచో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న అప్డేట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పై. యంగ్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమా సంగీతం ఇస్తాడు అని జస్ట్ బజ్ రావడంతో సినిమాపై హైప్ ఇంకో లెవెల్ కి వెళ్ళింది. ఇదిలా ఉండగా ఈరోజు అనిరుద్ బర్త్ డే కావడంతో అన్ని సినీ వర్గాల వారు అనిరుద్ కి విషెష్ తెలియజేస్తుండగా ఎన్టీఆర్ 30 ట్యాగ్ ఇండియన్ వైడ్ ట్రెండింగ్స్ లోకి ఎక్కేసింది.

అయితే ఈ స్పెషల్ డే కి అయినా ఈ ఎన్టీఆర్ కి చిత్ర యూనిట్ అనిరుద్ పేరుని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్న అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ సినిమా ట్యాగ్ ట్రెండింగ్ లోకి యిట్టె వచ్చేసింది. దీనితో ఈ సినిమా విషయంలో అనిరుద్ నే కావాలని అంతా ఎంత పర్టిక్యులర్ గా ఉన్నారో అర్ధం అవుతుంది. మరి మేకర్స్ మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అది వస్తుందో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :